యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్ రెస్పాన్స్ ఇదే..!

August 21, 2019


img

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు సోమవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ కు గురైందన్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుండి పరుగెడుతూ వెళ్లినట్టుగా సీసీ టివి ఫుటేజ్ లో కనిపించింది. రాజ్ తరుణ్ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మీడియా వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసుకొచ్చారు. అయితే ఈ సంఘటనపై రాజ్ తరుణ్ లేటెస్ట్ గా ట్వీట్ చేశాడు.  

తాను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు.. తన మీద చూపిస్తున్న ఈ ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు.. గత మూడు నెలలుగా తను ఇంటి నుండి నార్సింగ్ సర్కిల్ మీదగా ప్రయాణిస్తున్నా.. అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడే సడెన్ గా తను రైట్ టర్న్ తీసుకునే టైంలో కారు అదుపు తప్పి పక్కన ఉన్న గోడను ఢీ కొట్టింది. శబ్ధం పెద్దగా రావడంతో షాకు గురయ్యాను.. సీటు బెల్టు పెట్టుకుని ఉండటం వల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.. భయంతో ఇంటికి పరుగెత్తానని.. ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్నాను.. త్వరలో షూటింగ్ లో జాయిన్ అవుతా అంటూ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ గురించి మంగళవారం వార్తల్లో హెడ్ లైన్స్ కాగా రాజ్ తరుణ్ చిన్నగా ఈరోజు రెస్పాండ్ అవడం గురించి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.    

     


Related Post

సినిమా స‌మీక్ష