సాహో ఆ 12 నిమిషాలు ఎవరు సీట్లలో కూర్చోరట..!

August 20, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమా సాహో. ఈ నెల 30న భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఓ రేంజ్ లో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో 12 నిమిషాల సీన్ మాత్రం మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేస్తుందట. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోవడం కష్టమే అని తెలుస్తుంది. 

సాహోలో ప్రీ క్లైమాక్స్ లో 12 నిమిషాల శాండ్ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ మాములుగా ఉండదని అంటున్నారు. ఆ ఒక్క ఫైట్ కోసం 80 కోట్ల దాకా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. మరి ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఆ రేంజ్ లో ఉంటే ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సాహో టీం చెబుతున్నట్టుగానే సాహోతో ప్రభాస్ మరో సెన్సేషన్ సృష్టించడం ఖాయమని ఫిక్స్ అవ్వొచ్చు. మరి సినిమా అసలు ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే.  



Related Post

సినిమా స‌మీక్ష