సైరాతో సాహో.. పక్కనే అల్లూరి..!

August 20, 2019


img

ఈరోజు సైరా టీజర్ రిలీజ్ కోసం మెగాస్టార్ అండ్ టీం ముంబైలో ప్రత్యక్షమయ్యారు. చిత్రయూనిట్ సమక్షంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లో సైరా టీజర్ రిలీజ్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా సినిమా టీజర్ అదరగొట్టింది. చరిత్ర మరచిపోయిన వీరుడి కథను భారీస్థాయిలో భారీ బడ్జెట్ తో సైరా సినిమాగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ కు ముందే ఆల్రెడీ సాహో ప్రమోషన్స్ కోసం అక్కడే ఉన్న ప్రభాస్ సైరా టీం ను కలవడం జరిగిందట.

అలా సైరాతో సాహో ఆ పక్కనే సైరా నిర్మాత ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరిగా నటిస్తున్న రాం చరణ్ కూడా కలిసి దిగిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం చిరు, చరణ్, ప్రభాస్ లు కలిసి దిగిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహోతో ఈ నెల 30న బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధాయ్యాడు ప్రభాస్. అది రిలీజైన నెల రోజుల తర్వాత మళ్లీ సైరాతో సంచలనానికి సిద్ధమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మొత్తానికి తెలుగు సినిమాల హవా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో ఈ సినిమాల ప్రమోషన్స్ చూసి అర్ధం చేసుకోవచ్చు.   Related Post

సినిమా స‌మీక్ష