అర్జున్ రెడ్డి కాంబో రిపీట్..!

August 20, 2019


img

పెళ్లి చూపులు లాంటి సైలెంట్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా బాక్సాఫీస్ పై విరుచుపడతాడని ఊహించి ఉండరు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు సందీప్ వంగ కూడా ఈ మూవీతో క్రేజీ డైరక్టర్ గా మారాడు. అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్ వంగ.

కబీర్ సింగ్ హిట్ తో సందీప్ కు బాలీవుడ్ మూవీ ఛాన్సులు వస్తున్నాయట. అయితే సందీప్ వంగ మాత్రం మరోసారి విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఆనంద్ అన్నామలై సినిమా కూడా లైన్ లో పెట్టాడు. ఈ రెండు పూర్తి చేశాక సందీప్ వంగ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి అర్జున్ రెడ్డి కాంబో అంటే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష