సైరా టీజర్.. చరిత్ర మనతోనే మొదలవ్వాలి..!

August 20, 2019


img

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. చరిత్ర మరచిపోయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో సైరా సినిమా వస్తుంది.       

ఇక సినిమా టీజర్ గురించి మాట్లాడుకుంటే.. బాహుబలితో తెలుగు సినిమా స్టామినా చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సైరా నరసిం హా రెడ్డి సినిమా తెలుగు సినిమా సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నరసింహా రెడ్డి పాత్రలో అదరగొట్టారు. విజువల్స్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ అన్ని సినిమాలో ది బెస్ట్ అనిపించేలా ఉన్నాయి. కథకు తగినట్టుగా పాత్రలకు కావాల్సిన నటులను ఎంపిక చేసుకున్నాడు సురేందర్ రెడ్డి.  

అక్టోబర్ 2న రిలీజ్ అవబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా చిరు కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో మరో గొప్ప సినిమాగా మిగిలిపోయేలా ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు చిరంజీవి. 
Related Post

సినిమా స‌మీక్ష