రాజశేఖర్ తర్వాత సినిమా అదేనా..!

August 19, 2019


img

యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ గరుడవేగ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే అనిపించగా రీసెంట్ గా వచ్చిన కల్కి మళ్లీ ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. కల్కి హిట్టైతే గరుడవేగ సీక్వల్ ఉంటుందని అన్నారు. కాని అది తేడా కొట్టడంతో గరుడవేగ సీక్వల్ తో పాటు కల్కి సీక్వల్ ఆలోచన కూడా మానుకున్నారు. ఫైనల్ గా రాజశేఖర్ తన తర్వాత సినిమా కన్ ఫాం చేశారు.   

విజయ్ ఆంటోనీ బేతాళుడు సినిమాను డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్షన్ లో రాజశేఖర్ సినిమా చేస్తున్నారట. బేతాళుడు తర్వాత క్షణం తమిళ రీమేక్ డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే రాజశేఖర్ ను డైరెక్ట్ చేసే సినిమా కూడా కన్నడ సినిమా రీమేక్ అని తెలుస్తుంది. తమిళ క్రిటిక్ కం ప్రొడ్యూసర్ ధనుంజయ్ తో పాటుగా జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారట. Related Post

సినిమా స‌మీక్ష