సంక్రాంతి బరిలో నందమూరి హీరో..!

August 19, 2019


img

టైటిల్ చూసి కచ్చితంగా ఇది ఆ నందమూరి హీరో ఎన్.టి.ఆర్ అయ్యే ఛాన్స్ లేదని అందరు అనుకుంటారు. తారక్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నందమూరి హీరో బాలకృష్ణ ఆల్రెడీ పొంగల్ కు తన సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. కాని ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మరో నందమూరి హీరో కళ్యాణ్ రాం కూడా సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. 118 తర్వాత కళ్యాణ్ రామ్ శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్నతో సినిమా చేస్తున్నాడు.       

ఎంత మంచివాడవురా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. శ్రీదేవి మూవీస్, ఆదిత్య మూవీస్ బ్యానర్ లో ఉమేష్ గుప్త ఈ సినిమా నిర్మిస్తున్నారు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందట. త్వరలోనే రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శతమానం భవతి సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టింది. అదే సెంటిమెంట్ తో ఈ సినిమాను పొంగల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. బాలకృష్ణ, కె.ఎస్ రవికుమార్ కాంబో మూవీ కూడా సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు. మరి ఎంతమంచివాడవురా సినిమా రిలీజ్ ఎప్పుడన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష