కౌసల్యా కృష్ణమూర్తి ట్రైలర్..!

August 19, 2019


img

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కణా సినిమాను తెలుగులో రీమేక్ చేశారు భీమనేని శ్రీనివాస్. తెలుగులో రీమేక్ స్పెషలిస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న భీమనేని శ్రీనివాస్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేశారు. కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో తమిళంలో నటించిన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో కూడా లీడ్ రోల్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో పరిచయం ఉన్న నటుడు రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య.

తెలుగులో ఆమెకిది మొదటి సినిమా. ఈ నెల 23న రిలీజ్ అవుతున్న కౌసల్యా కృష్ణమూర్తి ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. కథ విషయానికొస్తే ఓ రైతు కూతురు ఇండియన్ క్రికెట్ టీం లో ఆడాలనే కలను ఎలా సాకారం చేసుకుంది అన్నది సినిమా. సినిమాలో శివ కార్తికేయ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తమిళ సినిమా కణకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అందుకే తెలుగులో కూడా ఆయన్నే కెమియో రోల్ చేసేలా ఒప్పించారు. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా కౌసల్యా క్రికెట్ కష్టాలు ఆడియెన్స్ కు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.  





Related Post

సినిమా స‌మీక్ష