శ్రీముఖి చెప్పినట్టే జరిగింది..!

August 19, 2019


img

బిగ్ బాస్ 3 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న శ్రీముఖి చెప్పినట్టే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయన్న టాక్ మరోసారి హాట్ న్యూస్ గా మారింది. మొదటి వారం హేమ, రెండో వారం జాఫర్, మూడవ వారం తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక నాల్గవ వారం మాత్రం ఎవరు ఊహించని విధంగా రోహిణి ఇంటి నుండి బయటకు వచ్చింది. గత సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో రోహిణి నామినేట్ అవలేదు. రోహిణి, శివ జ్యోతి ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వాల్సి ఉండగా శివ జ్యోతి తాను నామినేట్ అవుతానని బిగ్ బాస్ తో చెప్పింది.      

ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ గురించి బయటకు వచ్చి డిస్కస్ చేసినందుకు గాను రోహిణి నామినేట్ అయ్యింది. అయితే అలా పొరపాటున నామినేట్ అయిన రోహిణి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. హౌజ్ లో రోహిణి ఎలాంటి గొడవలు లేకుండా అందరితో కలివిడిగా ఉంటుంది. కాని ఆమె వల్ల షోకి పెద్దగా బజ్ కూడా రావట్లేదు. అందుకే బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేశారని అంటున్నారు. రోహిణి నామినేట్ అవగానే ఈసారి రోహిణినే ఎలిమినేట్ అవుతుందని ఆమె ముఖం మీద చెప్పింది శ్రీముఖి. అలా చెప్పడం వల్ల రోహిణికి, శ్రీముఖికి మధ్య చిన్నపాటి రభస కూడా జరిగింది.

ఫైనల్ గా రోహిణి బయటకు వచ్చింది. అయితే శ్రీముఖి టార్గెట్ చేసిన వారే హౌజ్ నుండి బయటకు వచ్చేస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో కౌశల్ ఎవరినైతే నామినేట్ చేస్తాడో వారిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. మరి నిజంగానే శ్రీముఖి చెప్పినట్టుగా బిగ్ బాస్ చేస్తున్నాడా లేక అలా అనిపిస్తుందా అన్నది ఈ వారం ఎలిమినేషన్స్ చూస్తే కాని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష