షార్ట్ మీద స్టోరీ చెప్పాడు.. సుజిత్ పెద్ద డైరక్టర్ అవుతాడు..!

August 19, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రాజమౌళి, వినాయక్ లతో పాటుగా ఎంతోమంది సిని ప్రముఖులు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొని సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సూపర్ సక్సెస్ చేశారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ సుజిత్ లాంటి చిన్న డైరక్టర్ తో సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ ఆ విషయాన్ని ప్రస్థావించాడు. తనకు కథ చెప్పినప్పుడు సుజిత్ షార్ట్ మీద వచ్చాడు. అప్పుడు అతని ఏజ్ 22 ఏళ్లు. ఆ తర్వాత సాహో పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టింది. అంటే ఇప్పుడు సుజిత్ వయసు 26 ఏళ్లు. సుజిత్ నాలుగేళ్ల కల ఈ నెల 30న నిజం కాబోతుందని అన్నారు ప్రభాస్.

తన వయసు గురించి కాకుండా అతను చెప్పిన కథను నమ్మి 350 కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశం ఇచ్చిన తన స్నేహితులు ప్రమోద్, వంశీ, విక్కిలను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు ప్రభాస్. సీనియర్లతో పని చేయించుకోవడం ఎలా చేస్తాడో అనుకున్నాం కాని ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్నవాడిగా అవుట్ పుట్ తీసుకొచ్చాడు. నాలుగేళ్లు ఈ సినిమా కోసమే చేశాడంటూ సుజిత్ మీద ప్రశంసలు కురిపించాడు ప్రభాస్.      



Related Post

సినిమా స‌మీక్ష