మెగాస్టార్ మూవీకి పవర్ స్టార్ వాయిస్.. ప్రూఫ్ ఇదే..!

August 16, 2019


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇక సైరా టీజర్ ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు.  

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కాని రెండు రోజుల ముందే ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు చిరు. ఇక ఈ టీజర్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే. మెగాస్టార్ సినిమాకు పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇంతకంటే మెగా ఫ్యాన్స్ కు ఏం కావాలి చెప్పండి. సినిమా మొత్తం పవన్ వాయిస్ ఉంటుందా లేక టీజర్ వరకే ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటైనా సైరా సినిమా బాహుబలిని మించే కలక్షన్స్ వసూళు చేసే సత్తా ఉందని అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.  

 


Related Post

సినిమా స‌మీక్ష