మహేష్ సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

August 16, 2019


img

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ఈమధ్యనే రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. సైనికుల గురించి గొప్పగా వర్ణిస్తూ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ సాగింది.

2020 సంక్రాంతి టార్గెట్ తో ఈ సినిమా వస్తుంది. జనవరి 10న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి నటించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు సూపర్ సక్సెస్ అందుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరుతో కూడా ఆ సక్సెస్ మేనియా కొనసాగించేలా ఉన్నాడు.   

 



Related Post

సినిమా స‌మీక్ష