సైరా సమరానికి సిద్ధమా..!

August 13, 2019


img

మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 250 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు.   

ఈ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో ఆగష్టు 14 మధ్యాహ్నం 3 గంటల్ 45 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా టీజర్ వస్తుందని తెలుస్తుంది. బాహుబలి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా సైరా తెరకెక్కించారని చెప్పొచ్చు. మేకింగ్ వీడియో రిలీజ్ పోస్టర్ లో యుద్ధానికి సంసిద్ధమైన వీరుడిగా చిరు కనిపిస్తున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సైరా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష