వాల్మీకి టీజర్ వచ్చేస్తుంది..!

August 13, 2019


img

మెగా హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. 14 రీల్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆగష్టు 15న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వాల్మీకి సినిమా తెరకెక్కుతుంది. ఎఫ్-2 సూపర్ హిట్ తో ఫాంలో ఉన్న వరుణ్ తేజ్ వాల్మీకితో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమిళంలో బాబి సింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే తన లుక్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన వరుణ్ తేజ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.             Related Post

సినిమా స‌మీక్ష