హిట్ కొడితే సీక్వల్ పక్కా అట..!

August 13, 2019


img

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా రణరంగం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. సినిమా దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం ఈ సినిమా హిట్ పడితే సీక్వల్ చేస్తా అంటున్నాడు. 

సినిమా షూటింగ్ టైంలో శర్వానంద్ ఓ లైన్ చెప్పాడట.. ఆ లైన్ బాగా నచ్చడంతో రణరంగం హిట్టైతే తప్పకుండా సీక్వల్ చేసి తీరుతా అంటున్నాడు సుధీర్ వర్మ. ఈ సినిమా శ్రద్ధ పెట్టి చేశాను.. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని చెబుతున్నారు సుధీర్ వర్మ. స్వామిరారా సినిమాతో సత్తా చాటిన ఈ దర్శకుడు ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. మరి రణరంగంతో హిట్టు కొడతాడా లేదా అన్నది చూడాలి.         Related Post

సినిమా స‌మీక్ష