రాజమౌళి ప్రెజర్ ఫీల్ అవుతున్నాడా..!

August 13, 2019


img

దర్శకధీరుడు రాజమౌళి ప్రెజర్ ఫీల్ అవడమేంటి.. తెలుగులో తిరుగులేని దర్శకుడిగా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు అలాంటి రాజమౌళి మీద ప్రెజర్ ఎందుకు ఉంటుంది అనే డౌట్ రావొచ్చు. బాహుబలి లాంటి సినిమా తీశాక ఆ తర్వాత వచ్చే సినిమా దాన్ని మించేలా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకే ఆర్.ఆర్.ఆర్ అంటూ రాం చరణ్, ఎన్.టి.ఆర్ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు జక్కన్న.

సినిమా మొదలైన దగ్గర నుండి అడ్డంకులు వచ్చి పడుతున్నాయి.. అంతేకాదు హీరోలిద్దరికి గాయాలవడం కూడా రాజమౌళిని షాక్ అయ్యేలా చేశాయట. ఓ పక్క 2020 జూలై 30 రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి సినిమాను అనుకున్న టైంకు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇంతవరకు సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఓకే అవలేదు. ఇవన్ని రాజమౌళి మీద ప్రెజర్ కలిగించేలా ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. మరి నిజంగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విషయంలో ప్రెజర్ పడుతున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.       Related Post

సినిమా స‌మీక్ష