అల్లు అర్జున్, త్రివిక్రం 'వైకుంఠపురంలో'!

August 13, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్ పై ఓ న్యూస్ లీక్ అయ్యింది. మొన్నటిదాకా నాన్న నేను, అలకనంద టైటిల్స్ పరిశీలణలో ఉన్న ఈ సినిమాకు ఇప్పుడు కొత్త టైటిల్ ఫిక్స్ చేశారట. ఆగష్టు 15న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని టాక్. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు వైకుంఠపురంలో అని పెట్టబోతున్నారట. త్రివిక్రం ఆ టైటిల్ ను ప్రిఫర్ చేశాడటే కచ్చితంగా సినిమా కథ కూడా ఆ రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది. మరి వైకుంఠపురంలో బన్ని ఏం చేశాడో తెలుసుకోవాలంటే 2020 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.         Related Post

సినిమా స‌మీక్ష