సరిలేరు నీకెవ్వరు రాములమ్మా: అనిల్ రావిపూడి

August 12, 2019


img

తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి సుమారు 13 ఏళ్ళ క్రితం సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలలోకి ప్రవేశించారు. రాజకీయాలలో కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నప్పటికీ సినిమాలలో రాణించినంతగా రాణించలేకపోయారు. కారణాలు అందరికీ తెలుసు. మళ్ళీ 13 ఏళ్ళ తరువాత ఆమె సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె తొలిసారిగా మొన్న ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు చిత్రా యూనిట్ సభ్యులందరూ కరతాళధ్వనులతో ఆమెకు  స్వాగతం పలికారు. ఆమె తన సినిమాలో నటించడానికి అంగీకరించగానే ఆమెను స్వాగతిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి “13 ఏళ్ళ తర్వాత...ఇది విజయశాంతి మేడమ్‌కు మేకప్‌ టైమ్‌. ఈ 13 ఏళ్ల విరామంలో ఆమెలో ఎటువంటి మార్పులేదు. అదే క్రమశిక్షణ, ప్రవర్తన, ధీరత్వం. స్వాగతం మేడమ్‌,” అంటూ ట్వీట్ చేశారు. 

ఇప్పటికే చిరంజీవి సినిమాలలో మళ్ళీ బిజీ అయిపోయారు. ఇప్పుడు విజయశాంతి కూడా వచ్చేశారు కనుక మళ్ళీ వారిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్‌లో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. 


Related Post

సినిమా స‌మీక్ష