సాహో ట్రైలర్.. ప్రభాస్ దమ్ముచూపిస్తాడా

August 10, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ అయ్యింది. ముంబైలో ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. టీజర్ తో సెన్సేషనల్ సృష్టించిన సాహో ట్రైలర్ తో మరింత అంచనాలను పెంచింది. ముంబైలో రెండు వేల కోట్ల రాబరీ జరగడంతో దాన్ని ఛేధించేందుకు అండర్ కవర్ కాప్ గా ప్రభాస్ వస్తాడు.   

అయితే ఆల్రెడీ మాఫియా డాన్ తో ఆర్జె సిటీ నుండి లక్ష కోట్లు విలువచేసే సీక్రెట్స్ ఇచ్చేలా ఢీల్ సెట్ చేసుకుంటాడు. అప్పటికే కరుడు కట్టిన డాన్లు ఎంతోమంది దానిపై కన్నేశాడు. ప్రదామకరమైన మిషన్ లో దిగిన ప్రభాస్ ఎలా గట్టెక్కాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ చూస్తే తెలుగులో మరో క్రేజీ సినిమా రాబోతుందని అర్ధమవుతుంది. విజువల్ వండర్ గా రాబోతున్న సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష