బిగ్ బాస్ నుండి తమన్నా అవుట్..!

August 10, 2019


img

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 నుండి మూడవ వారం ఎలిమినేషన్ అందరు అనుకున్నట్టుగానే తమన్నా సింహాద్రి బయటకు వచ్చిందని తెలుస్తుంది. 15 మంది ఇంటి సభ్యులున్న బిగ్ బాస్ హౌజ్ లో మొదటి వారం హేమ ఎలిమినేట్ అవగా.. రెండో వారం టివి 9 జాఫర్ బయటకు వచ్చాడు. ఇక మూడవ వారం హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్తారో ముందే లీక్ అయ్యింది. అందరు అనుకున్నట్టుగానే తమన్నా సింహాద్రి ఇంటి నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.   

హౌజ్ లో తమన్నా ప్రవర్తన ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. రవిని పప్పు అంటూ తమన్నా చేసిన కామెంట్స్ ఇంటి సభ్యులకు నచ్చలేదు. అంతేకాదు తమన్నా తనకు ఎదురు తిరిగి ఎవరు మాట్లాడినా వారిని కించపరచేలా పర్సనల్ గా ఎటాక్ చేస్తుంది. ఇంట్లోని కంటెస్టంట్స్ మాత్రమే కాదు బయట ఆడియెన్స్ కూడా ఆమె చేసిన పనుల గురించి విరక్తి చెందారు. అందుకే ఈ వారం ఆమెను ఎలిమినేట్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఆదివారం ఎపిసోడ్ లో తమన్నానే ఇంటి నుండి బయటకు వస్తుందా లేదా అన్నది చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష