మన్మథుడు 2 : రివ్యూ

August 09, 2019


img

రేటింగ్ : 2/5

కథ : 

సామ్ అలియాస్ సాంబ శివ రావు (నాగార్జున) పోర్చుగల్ లో ఉంటాడు. అమ్మాయిలతో కేవలం బెడ్ రిలేషన్ మాత్రమే పెట్టుకునే ప్లే బాయ్ అతను. యంగ్ ఏజ్ లో ప్రేమ విఫలమవడంతో పెళ్లి మీద విరక్తి పెంచుకుంటాడు. తల్లి, అక్కచెల్లెల్లు పెళ్లిపై ఎంత ఫోర్స్ చేస్తున్నా తప్పించుకుంటాడు. అయితే ఈసారి తనని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని ప్లాన్ చేస్తారు. ఇంట్లో వాళ్ల నస భరించలేక అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్) ను ఇంట్లో వాళ్లకు పరిచయం చేసి ఆమెని రెండేళ్లుగా ప్రేమిస్తున్నా ఆమెనే పెళ్లాడుతా అంటూ షాక్ ఇస్తాడు. అయితే అది కేవలం ఇంట్లో వాళ్లను మిస్ గైడ్ చేసేందుకే. అవంతిక, సాంబ శివ రావు ఓ అగ్రిమెంట్ తో ఈ డీల్ కుదుర్చుకుంటారు. ఇంతకీ సాంబ శివ రావు, అవంతికల రిలేషన్ అగ్రిమెంట్స్ వరకే పరిమితమైందా.. ఫ్యామిలీని మోసం చేసిన సాంబ శివ రావు ఫైనల్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.      

విశ్లేషణ :

మన్మథుడు సీక్వల్ కాకపోయినా మన్మథుడు 2 అంటూ టైటిల్ పెట్టడంతో సినిమాపై మాములుగానే అంచనాలు పెరుగుతాయి. మన్మథుడు 2 విషయంలో అదే జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో ఈ సినిమా వచ్చింది. నాగార్జున ప్లే బోయ్ రోల్ లో అసలు సూట్ అవలేదు. సినిమా అంతా ప్రతి సీన్ ఏదో అలా వెళ్తున్నట్టుగా ఉంటుంది. 

వెన్నెల కిశోర్ కామెడీ, రావు రమేష్ పంచులు మాత్రమే సినిమాలో రిలీఫ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఇక మిగతా ఎమోషనల్ సీన్స్ అంతా ఆడియెన్స్ కు కనెక్ట్ అవలేదు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ అని అన్నారు. కాని అంత గొప్ప కథ.. కొత్త కథలా ఏమి అనిపించలేదు. చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ మన్మథుడు 2తో ఆకట్టుకోలేకపోయాడు.   

సినిమా అన్ని విభాగాల్లో నిరాశపరచింది. కథ పరమ రొటీన్ అయితే కథనం అంతకన్నా రొటీన్ గా సాగించాడు. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని రాసుకున్న కొన్ని డైలాగ్స్ తప్ప సినిమాలో ఏది లేదు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియెన్స్ చూడాలంటే కొంచం ఇబ్బందిగా అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి. మరి నాగ్ ఈ వయసులో ఇలా డోసు పెంచి చేయడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. 

నటన, సాంకేతికవర్గం :   

సాంబ శివ రావు పాత్రలో నాగార్జున జస్ట్ ఓకే అనిపించాడు. నాగార్జున ఎవర్గ్రీన్ మన్మథుడే కాని ఈ సినిమాలో కాస్త ఆయన ఏజ్ కనిపించింది. స్టైలిష్ గా కనిపించినా అక్కడక్కడ కాస్త ముసలితనం బయటకు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. నటించడానికి స్కోప్ ఉన్న పాత్రే అయినా ఆమె సోసోగానే అనిపిస్తుంది. సీనియర్ నటి లక్ష్మి నటన ఆకట్టుకుంది. డిడి, ఝాన్సిలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్, రావు రమేష్ ల కామెడీ బాగుంది. అతిధి పాత్రల్లో కీర్తి సురేష్, సమంత అలరించారు. బ్రహ్మానందం కూడా ఒక్క సీన్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సుకుమార్ సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. చేతన్ భరధ్వాజ్ మ్యూజిక్ సినిమాకు మైనస్. పాటలు ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. బిజిఎం జస్ట్ ఓకే అనిపించగా.. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. కథ, కథనాల్లో దర్శకుడు రాహుల్ రవింద్రన్ ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.     

ఒక్కమాటలో :

నాగార్జున మన్మథుడు 2.. పేరుని చెడగొట్టేశారు..!


Related Post

సినిమా స‌మీక్ష