బిగ్ బాస్ 3కి బ్రేక్ పడనుందా..!

July 20, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3కి తాత్కాలిక బ్రేక్ పడుతుందా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొత్త వివాదం లేవనెత్తారు. ఈ వివాదంలో ఓయూ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవడంతో వివాదం మరింత ముదిరింది. నాగార్జున ఇంటిని, అన్నపూర్ణ స్టూడియోని ఇప్పటికే ఓయూ స్టూడెంట్స్ ముట్టడి చేసినట్టు తెలుస్తుంది.

వివాదం పెద్దవుతున్న కారణంతో కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు వెనుకాడుతున్నాడట. అసలైతే జూలై 20 ఆదివారం షో స్టార్ట్ అవ్వాల్సి ఉంది అంటే ఇప్పటికే కంటెస్టంట్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి ఉండాలి. నాగార్జున ఎపిసోడ్ కూడా ఇప్పటికే షూట్ చేయాల్సి ఉంది. మరి ఇవన్ని జరిగినట్టు ఏమి తెలియట్లేదు. స్టార్ మా.. బిగ్ బాస్ నిర్వాహకులు షోని కొద్దిరోజుల తర్వాత స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ మాలో ప్రోమోని ఆపేసినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే బిగ్ బాస్ సీజన్ 3 ఆగిపోతుందా లేదా అన్నది ఈరోజు రేపట్లో తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష