డియర్ కామ్రేడ్ సెన్సార్ రివ్యూ..!

July 20, 2019


img

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 26న రిలీజ్ కాబోతుంది. తీసింది తెలుగులోనే అయినా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం యూత్ లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు డియర్ కామ్రేడ్ టీం ప్రయత్నిస్తుంది.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఊహించినట్టుగానే ఈ సినిమాకు U/A ఇచ్చారు సెన్సార్ సభ్యులు. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. సినిమా యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా ఉందని తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ మూవీ సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.     


Related Post

సినిమా స‌మీక్ష