మల్టీస్టారర్ గా మహాసముద్రం..!

July 19, 2019


img

ఆరెక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహా సముద్రం. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. 2017లో గృహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ ఇప్పుడు తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.

రవితేజ, అజయ్ భూపతి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో లవర్ బోయ్ సిద్ధార్థ్ కూడా జాయిన్ అవుతున్నాడట. అదితి రావు హైదరి హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమా క్రేజీ మల్టీస్టారర్ మూవీగా రాబోతుంది. ఈమధ్య సినిమా హిట్ల విషయంలో వెనుకపడ్డ రవితేజ ఈ సినిమాతో హిట్ పక్కా అంటున్నాడట. సినిమాలో సిద్ధు కూడా నటిస్తున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కు అదనపు ఆకర్షణ ఉన్నట్టే.    \Related Post

సినిమా స‌మీక్ష