రాఘవేంద్ర రావు ముగ్గురు దర్శకులు వాళ్లేనా..!

July 19, 2019


img

ఎన్.టి.ఆర్ జయంతి నాడు ఓ భారీ సినిమా ఎనౌన్స్ చేశాడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్స్.. ఒక హీరో అంటూ ఓ ప్రాజెక్ట్ చేపట్టాడు. ఈ ముగ్గురు దర్శకుల కథలు ఒకే సినిమాలో చూపిస్తారట. ముగ్గురు దర్శకులలో ఒకరు ప్రకాశ్ కోవెలముడి కాగా.. మరొకరు క్రిష్ జాగర్లముడి అని తెలుస్తుంది. ఇక మిగిలిన ఒక్క దర్శకుడు అనీల్ రావిపుడిని ఫిక్స్ చేశారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది తెలియలేదు కాని హీరోగా మాత్రం నాగ శౌర్యని ఫైనల్ చేశారట. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో ఆయన నిర్మాతగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ ముగ్గురు దర్శకులతో రాఘవేంద్ర రావు చేసే ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. హీరో నాగ శౌర్యకు ఈ సినిమా చాలా ప్లస్ అవ్వొచ్చని అంటున్నారు. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష