ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ వస్తుందా..!

July 19, 2019


img

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ ఇస్మార్ట్ శంకర్. గురువారం రిలీజైన ఈ సినిమా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మెప్పుపొందింది. పూరి డైలాగ్స్, టేకింగ్ తో పాటుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన వాళ్లంతా పూరి మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు చెబుతున్నారు. పక్కా పూరి మార్క్ మూవీగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.  

ఇక ఈ సినిమా సక్సెస్ అవగానే డబుల్ ఇస్మార్ట్ శంకర్ అని సీక్వల్ టైటిల్ కూడా వదిలాడు పూరి జగన్నాథ్. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులు తీసిన పూరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ హిట్ అందుకున్నాడు. ఛార్మి, పూరి కలిసి నిర్మించిన ఈ సినిమా రిలీజ్ ముందే లాభాలు తీసుకు రాగా కలక్షన్స్ లో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష