'ఎవరు' టీజర్.. అడివి శేష్ మరో థ్రిల్లర్ అటెంప్ట్..!

July 19, 2019


img

అడివి శేష్ హీరోగా వెంకీ రాంజీ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎవరు. క్షణం నుండి థ్రిల్లర్ సినిమాలను చేస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్న అడివి శేష్ ఈసారి ఎవరు సినిమాతో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఎప్పటిలానే టీజర్ తో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాడు అడివి శేష్.

టీజర్ లో కథ కొంత తెలుస్తున్నా సస్పెన్స్ థ్రిల్లర్ గా కచ్చితంగా ఇది ఆడియెన్స్ ను అలరిస్తుందని అంటున్నాడు అడివి శేష్. సమంత చీఫ్ గెస్ట్ గా వచ్చి ఎవరు టీజర్ రిలీజ్ చేశారు. క్షణం సినిమా మహేష్, సమంత ఇద్దరు టీజర్ షేర్ చేశారని ఆ సినిమా హిట్ అవడంతో ఈసారి కూడా సమంత లక్కీ హ్యాండ్ తో ఎవరు టీజర్ రిలీజ్ చేశామని చెప్పాడు అడివి శేష్. లాస్ట్ ఇయర్ గూఢచారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ ఎవరు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష