బోయపాటికి ఛాన్స్ ఇస్తున్న అల్లు అరవింద్..!

July 18, 2019


img

టాలీవుడ్ లో ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బోయపాటి శ్రీను ఇన్నాళ్లు డైరక్టర్ గా తను తెచ్చుకున్న క్రేజ్ మొత్తం రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాతో పోగొట్టుకున్నాడు. ఇదవరకు ఎన్.టి.ఆర్ తో తీసిన దమ్ము కూడా ఫ్లాప్ అయినా బోయపాటికి ఇంత చెడ్డ పేరు తీసుకురాలేదు. వి.వి.ఆర్ కథ, కథనాల్లో బోయపాటి చాలా పొరపాట్లు చేశాడు. అందుకే అతన్ని నమ్మి సినిమా ఇచ్చేందుకు జంకుతున్నారు. 

అసలైతే బోయపాటి బాలకృష్ణ సినిమా చేయాల్సి ఉన్నా.. ఈ కాంబో సినిమాకు నిర్మాతలెవరు ముందుకు రాకపోవడంతో సినిమా కుదరలేదు. దాదాపు ఆ సినిమా అటకెక్కినట్టే తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన గుణ 369 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ బోయపాటి శ్రీనుకి మరో ఛాన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చింది. అల్లు అర్జున్ కెరియర్ లో అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే అల్లు అరవింద్, బోయపాటి కాంబో సెట్ అయినా ఈసరి బన్ని ఈ సినిమా చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

ఆల్రెడీ త్రివిక్రం తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత వేణు శ్రీరాంతో ఐకాన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత వేరే సినిమా ఉంటుంది. అప్పటిదాకా బోయపాటి ఆగడు కాబట్టి ఈసారి గీతా ఆర్ట్స్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వేరే హీరోతో ఉంటుందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష