అడివి శేష్ 'ఎవరు'కి కాపీ మరక..!

July 18, 2019


img

తన సినిమాలకు తనే కథలు రాస్తూ యువ హీరోల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్న అడివి శేష్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. క్షణం నుండి గూఢచారి వరకు అడివి శేష్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. లేటెస్ట్ గా అడివి శేష్ ఎవరు సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో అడివి శేష్ కు జోడీగా రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. 

ఈమధ్యనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవగా పోస్టర్ తోనే అంచనాలు పెంచేశాడు అడివి శేష్. అయితే పోస్టర్ వచ్చిందో లేదో ఈ సినిమా కథ కాపీ అంటూ వార్తలు మొదలు పెట్టారు. ఎవరు సినిమా స్పానిష్ మూవీ ది ఇన్ విజిబుల్ గెస్ట్ అనే సినిమాను కాపీ చేసి తీశారన్న టాక్ వినిపిస్తుంది. వెంకట్ రాంజీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అడివి శేష్ కథ అందిస్తున్నాడు. మరి ఇది నిజంగా ఆ సినిమాకు కాపీనా లేదా అన్నది సినిమా వస్తేనే కాని తెలుస్తుంది.    


Related Post

సినిమా స‌మీక్ష