గుణ 369 ట్రైలర్.. మాస్ అండ్ క్లాస్ మిక్స్

July 17, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ హిప్పీతో అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం గుణ 369 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కార్తికేయ. బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఓ పక్క లవర్ బోయ్ గా కనిపిస్తూనే మరో పక్క తనలోని మాస్ యాంగిల్ చూపించాడు కార్తికేయ.

ట్రైలర్ చూస్తే క్లాస్, మాస్ మిక్స్ చేసి కొట్టినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్ గానే అనిపించింది. ముఖ్యంగా దర్శకుడు గురువు బోయపాటిని బాగా ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. ఆగష్టు 2న రిలీజ్ ప్లాన్ చేస్తున్న గుణ 369 సినిమాతో కార్తికేయ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  


Related Post

సినిమా స‌మీక్ష