సాహో రిలీజ్ వాయిదా

July 17, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.

అయితే సినిమాకు సంబందించిన వి.ఎఫ్.ఎల్స్ వర్క్స్ పూర్తి చేయడంలో లేటవడం వల్ల సినిమాను ఆగష్టు 15 నుండి 30కి వాయిదా వేస్తున్నారట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని సాహో ఆగష్టు 30 రిలీజ్ కన్ఫాం అని చెప్పొచ్చు. సాహో గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ డేట్ కు శర్వానంద్ రణరంగం, అడివి శేష్ ఎవరు సినిమాల రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. శర్వానంద్ రణరంగం సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తుంది ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.



Related Post

సినిమా స‌మీక్ష