నిర్మాతగా నారా లోకేష్.. బాలయ్యతో మూవీ..!

July 16, 2019


img

నారా లోకేష్ నిర్మాతగా మారుతున్నారా.. పాలిటిక్స్ కు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చి లోకేష్ సినిమాల్లోకి వస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. రాజకీయాలకు సమానంగా ఇమేజ్ రావాలంటే అది సినిమా వల్లే సాధ్యం. ఓ విధంగా చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్ కన్నా సినిమా వాళ్లకే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే నారా లోకేష్ కొత్తగా సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారని లేటెస్ట్ టాక్.

బాలయ్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 సీక్వల్ గా ఆదిత్య 999 కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉంది. సింగీతం శ్రీనివాస్ ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ నిర్మాత బాధ్యతలను నారా లోకేష్ వ్యవహరిస్తున్నాడట. లోకేష్ నిర్మాణంలో బాలయ్య హీరోగా ఈ మూవీ ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష