జెర్సీ రీమేక్ లో రానా

July 16, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. నాని నటన, గౌతం డైరక్షన్ రెండు కలిపి ఓ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించారు. సినిమా వచ్చినప్పుడే రీమేక్ ప్రయత్నాలు జరిగాయి. ఆల్రెడీ బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ గా జెర్సీ తమిళ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు దగ్గుబాటి రానా. 

అదేంటి రానా ఇందులో హీరోగా చేస్తాడా అంటే.. కాదు తమిళ జెర్సీ నిర్మాతగా మారుతున్నాడట రానా. అప్కమింగ్ డైరక్టర్ తో ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే అక్కడ స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ నాని సూపర్ హిట్ మూవీ నిన్ను కోరి కోలీవుడ్ రీమేక్ ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. అధర్వ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు. మరి జెర్సీకి ఎలాంటి కాస్ట్ అండ్ క్రూ సెట్ అవుతుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష