అదితిరావుకి అదిరిపోయే ఛాన్స్

July 16, 2019


img

లాస్ట్ ఇయర్ ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. రాం, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురు హీరోల నుండి మారుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా మాస్ మహరాజ్ రవితేజ దగ్గరకు వచ్చి ఆగింది. ప్రస్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం మూవీ చేస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అదితిరావు హైదరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మణిరత్నం చెలియాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు సమ్మోహనం, అంతరిక్షం సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు చేస్తున్న వి మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అదితిరావు మాస్ రాజా రవితేజతో జోడీ కట్టనుంది. అదిరి టాలెంట్ కు ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు.  



Related Post

సినిమా స‌మీక్ష