పూజా హెగ్దె.. కండీషన్స్ అప్లై

July 15, 2019


img

టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్దె పేరు చెబుతారు. డిజే నుండి తన ఫేట్ మార్చేసుకున్న పూజా ఈమధ్యనే మహర్షి సూపర్ హిట్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తన దర్శక నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందట. ఆ కండీషన్స్ రెమ్యునరేషన్ విషయంలోనో.. క్యారక్టర్ విషయంలోనో కాదు సినిమా షూటింగ్ కు సంబందించి అన్నమాట.  

తను సినిమా ఒప్పుకోవాలంటే సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగేలా చూడాలని ముందే దర్శక నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందట. ఇదేం విచిత్రమైన కండీషన్ అని అనుకోవచ్చు ఒక్కో సినిమాకు ఆరు నుండి ఏడాది దాకా షూటింగ్ జరుపుకుంటారు. ఆ టైం మొత్తం సరదాగా లేకపోతే ఎలా అంటుంది పూజా. తెలుగులో మొదట్లో రెండు ఫ్లాపులు పడ్డ పూజా హెగ్దె ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ రాగా వాటిని తిప్పికొడుతూ ఇప్పుడు అమ్మడు వరుస సూపర్ హిట్లు అందుకుని స్టార్ సినిమాల్లో నటిస్తుంది.     



Related Post

సినిమా స‌మీక్ష