కుమారికి లక్కీ ఛాన్స్..!

July 15, 2019


img

అలా ఎలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హెబ్భా పటేల్ సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా ఇచ్చిన హిట్ తో అమ్మడు స్టార్ రేంజ్ కు వెళ్తుందని అనుకున్నారు కాని కథల ఎంపికలో పొరపాట్లు వల్ల హెబ్భా కెరియర్ లో వెనుకపడ్డది. ఈమధ్యనే 24 కిస్సెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

ఇక ఇప్పుడు కుమారి హెబ్భాకు అదిరిపోయే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న భీష్మ సినిమాలో హెబ్భా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆల్రెడీ రష్మిక మందన్న ఒక హీరోయిన్ గా నటిస్తుండగా హెబ్భా కూడా జాయిన్ అవుతుందని తెలుస్తుంది. ఛలోతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల సెకండ్ ప్రాజెక్ట్ గా చేస్తున్న భీష్మ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. 



Related Post

సినిమా స‌మీక్ష