ఎవరు ఫస్ట్ లుక్.. ఇంప్రెసివ్

July 12, 2019


img

తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు అడివి శేష్. లాస్ట్ ఇయర్ గూఢచారి సక్సెస్ తో సర్ ప్రైజ్ చేసిన ఈ హీరో ఇప్పుడు ఎవరు సినిమాతో వస్తున్నాడు. పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకట్ రాంజి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సినిమాలో హీరోయిన్ గా రెజినా నటిస్తుండగా నవీన్ చంద్ర స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నాడు.

ఇక ఈ ఫస్ట్ లుక్ లో డైరెక్ట్ గా అడివి శేష్, అద్దంలో రెజినా కనిపించేలా వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఓ ఎక్సైట్మెంట్ కలిగించేలా చేశారు. క్షణం, గూఢచారి వంటి సినిమాలతో తెలుగు పరిశ్రమ రేంజ్ పెంచుతున్న అడివి శేష్ మరోసారి ఎవరుతో సత్తా చాటాలని చూస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా కూడా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. రాజశేఖర్ పెద్ద కూతురు శివానితో చేస్తున్న 2 స్టేట్స్ మూవీ ఆగిపోగా ఎవరుతో పాటుగా గూఢచారి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు అడివి శేష్.  Related Post

సినిమా స‌మీక్ష