ఓ బేబీ హింది రీమేక్.. హీరోయిన్ ఎవరంటే..!

July 12, 2019


img

కొరియన్ మూవీ మిస్ గ్రానీని తెలుగులో ఓ బేబీగా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు సమంత. నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పెళ్లి తర్వాత సమంత కొనసాగిస్తున్న ఈ ఫాంకు మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవడంతో హింది మేకర్స్ కన్ను పడ్డదని తెలుస్తుంది. సినిమా రైట్స్ 10 కోట్లకు సురేష్ బాబు కొన్నారు. 

ఇప్పుడు ఆయన దగ్గర నుండి హింది రైట్స్ తీసుకోవాలని చూస్తున్నారట. అయితే రానా తానే స్వయంగా బాలీవుడ్ లో ఈ మూవీ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. హీరోయిన్ గా అలియా భట్ ను అడగబోతున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్స్ ప్రయోగం అంటే ముందే ఉత్సాహం చూపిస్తారు. మరి ఓ బేబీ హింది రీమేక్ ఉంటుందా లేదా పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.  Related Post

సినిమా స‌మీక్ష