రాం చరణ్ ఫస్ట్ పోస్ట్ ఇదే..!

July 12, 2019


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కొత్తగా ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ ఓపెన్ చేశాడు. ఇకనుండి తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండేలా తన ఫోటోస్, వీడియోస్ షేర్ చేసేందుకు చరణ్ ఇన్ స్టా ఖాతా తెరిచాడు. ఇన్నాళ్లు ఫేస్ బుక్ ద్వారానే తన మెసేజ్ అందించే చరణ్ కొత్తగా ఇన్ స్టాగ్రాం కు వచ్చాడు. త్వరలోనే ట్విట్టర్ లో రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే రాం చరణ్ ఇన్ స్టాగ్రాం లో ఫస్ట్ ఫోటో షేర్ చేశాడు.

అమ్మతో దిగిన ఫోటో షేర్ చేసిన రాం చరణ్ అందులో ఓ సర్ ప్రైజ్ ఉంచాడు. అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా అమ్మతో చరణ్ పిక్ షేర్ చేశాడు. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారనిది అంటూ నా తొలి పోస్ట్ నీకే అంకితం లవ్ యూ అమ్మా అంటూ మెసేజ్ పెట్టాడు చరణ్. చెర్రి ఇలా ఆ ఫోటో పెట్టాడో లేదో మెగా ఫ్యాన్స్ అంతా తమ గ్రూప్స్ లో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. 

 


Related Post

సినిమా స‌మీక్ష