సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ..!

July 11, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా సాహో. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేయాలన్నది చిత్రయూనిట్ కన్ ఫ్యూజన్ లో ఉంది. చెప్పుకోడానికి తెలుగు సినిమానే అయినా బాలీవుడ్ డైరెక్ట్ రిలీజ్ కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.

ముంబైలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. అలా చేస్తే ముంబై మహానగరంలో సినిమా ప్రమోట్ చేసే మొదటి తెలుగు స్టార్ ప్రభాస్ అవుతాడు. ఇక హైదరాబాద్ లో మాత్రం ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తారట. మొత్తానికి సాహోకి బాలీవుడ్ ఫ్లేవర్ బాగా యాడ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సాంగ్ కూడా అక్కడ వారికి తెగ నచ్చేసింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష