మెగాస్టార్ సినిమాలో ఐశ్వర్యా రాయ్..!

July 11, 2019


img

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాకు కూడా రాం చరణ్ నిర్మాతగా ఉంటాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క వంటి భామల పేర్లు వినపడ్డాయి. కాని కొరటాల శివ మాత్రం చిరు కోసం ఐశ్వర్య రాయ్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట.

డైరెక్ట్ గా ఇప్పటివరకు తెలుగు సినిమా చేయని ఐశ్వర్యా రాయ్ ను ఒప్పించి తెలుగులో మెగాస్టార్ పక్కన సినిమా చేయించాలని కొరటాల శివ కోరుతున్నాడట. నిర్మాత చరణ్ ఆ విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఐశ్వర్యా రాయ్ సినిమాలో ఉంటే మరింత క్రేజ్ వచ్చినట్టే. అక్టోబర్ 2న సైరా సినిమా రిలీజ్ ప్లాన్ చేయగా అదే నెల చివర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష