డియర్ కామ్రేడ్ ట్రైలర్.. విజయ్ మరో హిట్ పక్కా...!

July 11, 2019


img

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ లో విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా లవ్, ఎమోషన్ అన్ని కనిపించాయి. 

రష్మిక మందన్న కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. భరత్ కమ్మ సినిమా కథను ట్రైలర్ లో చెప్పేశాడు. ఇప్పటివరకు సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ అయ్యారు. చూస్తుంటే విజయ్ దేవరకొండ ఖాతాలో మరో సూపర్ హిట్ పడేలా ఉంది. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండ తన సత్తా చాటనున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష