ఏజెంట్ ఆత్రేయకు లక్కీ ఛాన్స్..!

July 10, 2019


img

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. స్వరూప్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. చిన్న సినిమాగా విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద్వారా నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటుకున్నాడు. అందుకే ఇప్పుడు అతనికి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది.

నవీన్ సినిమా చూసిన అశ్వనిదత్ కూతురు స్వప్న దత్ తన నిర్మాణంలో నవీన్ తో ఓ సినిమా చేస్తుందట. ఈ సినిమాను పిట్టగోడ డైరక్టర్ అనుదీప్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా కొత్తగా ఉంటుందని టాక్. స్వప్నా సినిమాస్ లో నాగ్ అశ్విన్ చేసిన మహానటి సూపర్ సక్సెస్ అవగా ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లో మరో క్రేజీ మూవీగా నవీన్ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా ఆత్రేయ రిజల్ట్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.     Related Post

సినిమా స‌మీక్ష