నిర్మాతగా నిహారిక

July 10, 2019


img

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ లో నటించి మెప్పించింది. ఇక బుల్లితెర రియాలిటీ షో యాంకర్ గా కూడా ఇంప్రెస్ చేసిన ఈ అమ్మడు ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవగా ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేసింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. 3వ ప్రయత్నంగా సూర్యకాంతం సినిమా చేసింది నిహారిక. అది కూడా ఆమెకు నిరాశ మిగిల్చింది.  

అందుకే నిహారిక కొణిదెల తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలుస్తుంది. హీరోయిన్ గా ఫెయిలైన నిహారిక నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంలో నిహారిక సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. మెగా హీరోతోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి హీరోయిన్ గా సక్సెస్ అవని నిహారిక నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష