మేజర్ అజయ్ కృష్ణగా మహేష్..!

July 10, 2019


img

మహర్షి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మహేష్ 26వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు, అనీల్ రావిపుడి నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి మహేష్ లుక్ లీక్ అవగా హీరో పాత్ర పేరు కూడా లీక్ అయింది. ఇంతకీ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేస్తున్న పాత్ర పేరేంటి అంటే అజయ్ కృష్ణ అని తెలుస్తుంది.

దీనికి సంబందించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. మహర్షితో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.    Related Post

సినిమా స‌మీక్ష