బూమ్రాతో లవ్.. అనుపమ కామెంట్ ఇదే..!

July 10, 2019


img

ఇండియా క్రికెటర్ బూమ్రాతో అనుపమ పరమేశ్వరన్ లవ్ లో ఉందా..? వాళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారా..? ఈ డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. బూమ్రా, అనుపమ తమ ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ లలో ఒకరి పోస్టులు మరొకరు ప్రమోట్ చేస్తుంటే ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. మొన్నామధ్య బూమ్రా ఓ అమ్మాయితో కనిపిస్తే ఆమె ఎవరో కాదు అనుపమనే అంటూ వార్తలు రాశారు. అయితే వ్యవహారం ఎక్కడికో వెళ్లకముందే తన రెస్పాన్స్ ఇచ్చింది అనుపమ పరమేశ్వన్.

ఇంతవరకు బూమ్రాని కలిసింది లేదు.. ఏదో సోషల్ మీడియాలో ఇద్దరం అలా కలిశాం. తనని ఇంతవరకు డైరెక్ట్ గా కలవలేదు తన గురించి అసలు ఏమి తనకు తెలియదు మరి అలాంటప్పుడు తనని నేను ఎలా లవ్ చేస్తా అంటున్నారు అనుపమ. ఇలాంటి వార్తలు అసలు ఎలా రాస్తారో అర్ధం కాదని ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పుకొచ్చారు అనుపమ. ప్రస్తుతం తను సినిమాలతో బిజీగా ఉన్నానని ఇప్పుడప్పుడే ప్రేమ పెళ్లి ఆలోచనలో లేవని అన్నారు.  Related Post

సినిమా స‌మీక్ష