బిగ్ బాస్ లో క్రేజీ హీరోయిన్..?

July 09, 2019


img

కింగ్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 త్వరలో మొదలు కాబోతుంది. స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోలో ఈ సీజన్ మరింత క్రేజీగా మారింది. హోస్ట్ గా నాగార్జున ఆల్రెడీ సక్సెస్ అవగా బిగ్ బాస్ హోస్ట్ గా ఎలా చేస్తాడో చూడాలి. ఇక ఈ సీజన్ కంటెస్టంట్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదట. ఇప్పటికే పలువురు యాంకర్స్ ఈ షో చేస్తున్నట్టు వార్తలు రాగా లేటెస్ట్ గా ఓ క్రేజీ హీరోయిన్ కూడా బిగ్ బాస్ సీజన్ 3లో ఉంటుందని తెలుస్తుంది.

ఇంతకీ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరంటే కుమారి హెబ్భా పటేల్ అని తెలుస్తుంది. కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత అడపాదడపా హిట్లు పడుతున్నా స్టార్ లీగ్ లో మాత్రం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రిన్స్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న హెబ్భా పటేల్ బిగ్ బాస్ లో కంటెస్టంట్ గా వస్తుందని తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమే అయితే కుమారి క్రేజ్ వల్ల షోకి హైప్ వచ్చే అవకాశం ఉంది.    Related Post

సినిమా స‌మీక్ష