కల్కి : రివ్యూ

June 28, 2019


img

రేటింగ్ : 2.75/5 

కథ :

కొల్లపూర్ లో ఎమ్మెల్యేగా ఉన్న నర్సప్ప (అశుతోష్ రాణా) తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు) ని దారుణంగా చంపేస్తారు. శేఖర్ బాబుకి కారణం నర్సప్ప విరోధి పెరుమాళ్ల (శత్రు) అని అతన్ని వెతుకుతాడు నర్సప్ప. ఇదిలాఉంటే ఈ కేసు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కల్కి (రాజశేఖర్)ను పంపిస్తారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన కల్కికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? కల్కికి రిపోర్టర్ దత్త (రాహుల్ రామకృష్ణ) ఎలా సాయపడ్డాడు..? శేఖర్ బాబుని ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

అ! సినిమాతో ప్రతిభ చాటిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్కి సినిమాను బాగానే తెరకెక్కించాడు. కథ చెప్పుకుంటే చిన్నదే కాని దానికి దర్శకుడు రాసుకున్న కథనం ఇంప్రెస్ చేసింది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే స్పీడ్ గా అనిపించినా ఆడియెన్స్ ఎందుకో కన్ ఫ్యూజ్ అయ్యారనిపిస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రాణమని చెప్పొచ్చు. కథనంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక అవసరం లేకపోయినా సరే హీరో బిల్డప్ షాట్స్ కోసం వాడిన బిజిఎం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఓవరాల్ గా కల్కి కేవలం థ్రిల్లర్ జానర్ ఆడియెన్స్ కు మాత్రమే. 

కథనంలో ట్విస్టులు ఉన్నా వాటిని హ్యాండిల్ చేయడంలో దర్శకుడు అక్కడక్కడ ట్రాక్ తప్పాడని అనిపిస్తుంది. దర్శకుడి అనుభవం ఒక్క సినిమానే అనుభవమైన దర్శకుడు అయితే ఈ సినిమాను వేరేలా తీసి ఉండేవారు. 

నటన, సాంకేతికవర్గం :  

కల్కి పాత్రలో రాజశేఖర్ నటన బాగుంది. పాత్ర కోసం ఆయన బాగానే కష్టపడ్డారు. రాజశేఖర్ డబ్బింగ్ అంతగా మెప్పించలేదు. ఎమోషనల్ డైలాగ్స్ డోస్ సరిపోలేదు. మెయిన్ హీరోయిన్ అదా శర్మ కన్నా నందిత శ్వేతకు బెటర్ రోల్ వచ్చింది. పూజిత పొన్నడ చిన్న రోల్ కే పరిమితమైంది. అశుతోష్ రాణా విలనిజం బాగుంది. శత్రు, సిద్ధులు బాగానే చేశారు. రాహుల్ రామకృష్ణ రిపోర్టర్ రోల్ ఆకట్టుకుంది. నాజర్, జయప్రకాశ్ చిన్న రోల్స్ తో కనిపించారు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. శ్రావణ్ భరధ్వాజ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ కన్నా బిజిఎం బాగా ఇచ్చాడు. అయితే బిల్డప్ షాట్స్ లో బిజిఎం కాస్త అతిగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. 80ల కాలం నాటి కథగా కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ, కథనాలు గ్రిప్పింగ్ గా ఉన్నా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగినట్టు ఉన్నాయి.

ఒక్కమాటలో :  

రాజశేఖర్ 'కల్కి'.. ఇంప్రెస్ చేశారు కాని..! 



Related Post

సినిమా స‌మీక్ష