గుర్రాలతో ఆడుకుంటున్న తారక్..!

June 27, 2019


img

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో తారక్, చరణ్ కనిపించనున్నారు. ప్రస్తుతం కొమరం భీం కు సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ పాత్ర కోసం ఎన్.టి.ఆర్ గుర్రపు స్వారి నేర్చుకుకుంటున్నాడట. గుర్రాలతో ఎన్.టి.ఆర్ ఆడుకుంటున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీగానే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరన్నది అఫిషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదు.Related Post

సినిమా స‌మీక్ష