బాలకృష్ణతో ప్రయోగం చేస్తాడట..!

June 27, 2019


img

అ! సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న ప్రశాంత్ వర్మ రెండో సినిమాగా కల్కి సినిమా చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రశాంత్ వర్మ బాలకృష్ణతో ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలని ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

బాలయ్య కోసం ఓ అద్భుతమైన కథ రాశానని త్వరలో ఆయన్ను కలిసి కథ చెబుతానని అంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఈమధ్య ప్రశాంత్ వర్మ కోలీవుడ్ హీరో ధనుష్ కు కథ చెబుతాడని వార్తలు వచ్చాయి. కల్కి హిట్ అయితే మాత్రం కుర్రాడు స్పీడ్ పెంచేలా ఉన్నాడు. గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన ఈ కల్కి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష